telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” పక్కా హిట్… చిరంజీవి బయోపిక్… : నాగబాబు

nagababu1

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల కాలం నడుస్తోంది. టాలీవుడ్ లో ఈనెల 22న విడుదల కాబోయే వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “వర్మపై గౌరవం అంటే నెవర్… నేను కామెంట్ కూడా చేయను. బట్ ఐ నెవర్ డిజ్ రస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ డైరెక్టర్. డైరెక్టర్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ తీసినా, అతనిలో ఉన్న ఎబిలిటీస్ మీద నేనెప్పుడూ తప్పుగా మాట్లాడను. “లక్ష్మీస్ ఎన్టీఆర్”… దీనిపై నేను వ్యక్తిగతంగా చెబుతున్నా… రామారావు గారి జీవితంలో ఒడిదుడుకులు లేవండీ… హీ ఈజ్ ఆల్ వేస్ ఏ సక్సెస్ ఫుల్ హీరో. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు స్టార్ట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసుకున్న పాయింట్ అక్కడి నుంచి కాబట్టి, కొంత ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ దానిలో ఉంటుందని నా నమ్మకం. అందుకని అది బాగా ఉంటుందని అనుకుంటున్నా… సినిమా పక్కాగా హిట్ అవుతుందని భావిస్తున్నా” అని అన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? మెగా ఫ్యామిలీనే దీన్ని నిర్మిస్తుందా? అనే ప్రశ్నలకు నాగబాబు “నాకు అసలు… అన్నయ్య మీద బయోపిక్ తీయాలన్న ఉద్దేశం నాకు లేదండీ. మేబీ చరణ్ బాబుకు కూడా ఉండుండదని అనుకుంటున్నాను. ఎందుకంటే, అంత సెల్ఫ్ ప్రమోషన్ యాటిట్యూడ్ కాదు ఆయనది. కాకపోతే… బయోపిక్ తీయడానికి కొన్ని లక్షణాలు ఉండాలండీ… సిల్క్ స్మిత బయోపిక్ ఎందుకు బాగుంటుంది? డర్టీ పిక్చర్… ఒక ఆడపిల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, సక్సెస్… సిల్క్ స్మిత ఏమీ మహానటి సావిత్రి అంత గొప్పనటేమీ కాదు. కానీ సక్సెస్ ఫుల్ బయోపిక్… అలాగే సంజూ మీద… సంజయ్ దత్ మీద… సక్సెస్ ఫుల్ పీపుల్ మీద బయోపిక్ తీయాలంటే చూడటానికి… మనకు సినిమా అంటే ఏంటి? ఒక అప్ అండ్ డౌన్, ఒక కష్టం, ఒక సంతోషం, ఒక విజయం, ఒక అపజయం కలిస్తే ఇంట్రస్టింగ్ ఉంటది. అల్టిమేట్ గా బయోపిక్ అన్నా సినిమాయే కదా? సినిమాను ఆ విధంగా చూడాలని అనుకుంటాంగానీ, ఎప్పుడు సక్సెస్ ఫుల్ గా వెళ్లిపోయే వ్యక్తిపై బయోపిక్ తీస్తే ఇంట్రస్టింగ్ ఏం ఉంటదన్నది నా ఉద్దేశం” అని సమాధానం ఇచ్చారు.

Related posts