telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి… రతన్ టాటా డిమాండ్

Elephant

కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏనుగుకు ఆ పరిస్థితి రావడానికి బాధ్యులైన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. ఆ దిశగా కేరళ అటవీ శాఖ విచారణ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి…’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.

Related posts