telugu navyamedia
సినిమా వార్తలు

దీపికా మాజీ ప్రియుడి గురించి రణ్వీర్ కామెంట్స్

ranveer singh
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె ఆరేళ్లపాటు ప్రేమాయణం సాగించి, గతేడాది పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత కూడా దీపికా సినిమాలను చేయడం ఆపలేదు. ఒకవైపు వైవాహిక జీవితంతో, మరోవైపు సినిమాలతో ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. అయితే పెళ్ళి తరువాత దీపిక చిత్రాలేవీ ఇంకా విడుదల కాలేదు… కానీ రణ్వీర్ సింగ్ నటించిన “సింబా, గల్లీ బాయ్” చిత్రాలు ఇటీవలే విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రణ్వీర్ సింగ్ కు దీపికా మాజీ ప్రియుడి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. 
“ఒకవేళ మీ భార్య దీపికా, రణబీర్ తో కలిసి నటిస్తే… మీరు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారా ?” అంటూ రణ్వీర్ సింగ్ ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా సీరియస్ అయిన రణ్వీర్ ” నేను మీకు ఎలా కన్పిస్తున్నాను ? దీపికను నాకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. కాబట్టి ఆమె గురించి నేనెప్పుడూ ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వను” అంటూ ఫైర్ అయ్యారు.

Related posts