telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిస్నీ హాట్ స్టార్ కు షాకిచ్చిన “లక్ష్మీ బాంబ్” టీం

Laxmi Bomb

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ వేగంగా ఇటీవలే పూర్తయ్యింది . లక్ష్మి బాంబ్ లో అక్షయ్ కుమార్ లేడీ గెటప్ కు సంబంధించిన ఫోటోను ఆ మధ్య రిలీజ్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.ఇక ఈ సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆమధ్య ప్రకటించారు. సెప్టెంబర్ 9న అక్షయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వాల్సివుండగా నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాట్టు తెలుస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాను ఓటీటీ ద్వారా చూస్తే అంతగా ఆసక్తి ఉండక పోవచ్చు. అందుకే సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ కారణంగానే సినిమాను ఓటీటీ కాకుండా థియేటర్ లో విడుదల చేసే ఆలోచనకు వచ్చారట నిర్మాతలు.

Related posts