telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సినిమా వార్తలు

జనసేన ఎన్నికల మేనిఫెస్టోపై చరణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నిన్న తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ క్రమంలోనే జనసేన మేనిఫెస్టోపై టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. సమాజంలోని అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఈ ఎన్నికల్లో జనసేన సరికొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రశంసల వర్షం కురిపిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి చరణ్ అభినందనలు తెలిపాడు.
ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్ బుక్ పోస్ట్ చేశాడు. అయితే ఈ ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి వస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడగా, అన్నయ్య ఈ ప్రచారానికి రావడం లేదని స్పష్టం చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన పార్టీ తరపున మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, నిహారిక ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం చరణ్ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుండగా, కాలికి గాయమవడంతో డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మూడు వారాల పాటు వాయిదా పడింది.

Related posts