telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి “రేడియో మాధవ్” ట్రైలర్

Radio-Madhav

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా “మార్కొని మతాయ్”. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన తొలి చిత్రమిది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రేడియో మాధవ్’గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి. తెలుగులో ఈ చిత్రాన్ని “రేడియో మాధవ్” పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ చిత్రంపై ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారు. తన నిజ జీవిత పాత్రలో ఆయన నటించారు. ‘భాగమతి’లో విలన్‌గా, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో తండ్రిగా నటించిన జయరామ్ ఈ చిత్రంలో మిలటరీ నుంచి బయటకి వచ్చి బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ ఉండే పాత్ర పోషించారు. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ప్రేమకథ ఈ ‘రేడియో మాధవ్’ సినిమా. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts