telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో .. వివక్షకు తెరలేపారు.. అల్లర్ల లక్ష్యం అదేనా..

protester on violence in bangladesh

బంగ్లాదేశ్‌లో తొమ్మిది నెలల పసిబిడ్డ నుంచి 84 ఏళ్ల ముసలమ్మ వరకూ మహిళలు అత్యాచారాలు, ఇతర దాడులకు బాధితులుగా ఉన్నారు. ఈ హింసపై ఉద్యమిస్తున్నాం అంటున్న ఓ ఉద్యమకారిణి. ఇటీవలి నోకలి జిల్లాలో మదర్స్‌ విద్యార్థినిని అత్యాచారం చేసి, హత్యచేసిన ఘటనపై ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాం. 64 మహిళ సంఘాల నేత అత్వంలో జాతీయ స్థాయిలో ఒక వేదిక ఏర్పాటు చేశాం. విధాన నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. భూమిపై, ఆస్తిపై మహిళలకు హక్కు రావాలి. ముస్లిం లా ప్రకారం ఆస్తిలో రెండు అణాలే ముస్లిం మహిళ పొందేహక్కు ఉంటుంది. సగభాగం కావాలని పోరాడుతున్నాం. ముస్లిం, హిందూ, క్రైస్తవులతో పాటు ఇతర అన్ని మతాల్లో పురుషులకు, మహిళలకు సమానత్వంతో కూడిన ఫ్యామిలీ కోడ్‌ను మా సంఘం తయారు చేసింది. ప్రభుత్వం దాన్ని ఆమోదించేందుకు సిద్ధంగా లేదు.

మైనార్టీలపై దాడి జరగటం లేదు. అధికారం కోసం దాడులు, హింస జరుగుతున్నాయి. అవి మతం ప్రాతిపదిక కాదు. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తనకు అనుకూలంగా ఎన్నికలను నిర్వహించుకుంది. అన్ని రంగాల్లో మహిళల శ్రమ ఉంది. బాలికలు ఆటల్లోకి వస్తున్నారు. ఇది ముస్లిం లాకు వ్యతిరేకం కావడంతో, ఫండమెంటలిస్టులు ఆగ్రహంగా ఉన్నారు. జాతీయ పార్లమెంట్‌లో 250 స్థానాల్లో మహిళల కోసం 50 రిజర్డ్వ్‌ స్థానాలు ఉన్నాయి. మరో పది జనరల్‌ స్థానాల్లో మహిళలు గెలిచారు. ప్రస్తుతం 60 మంది మహిళా ఎంపిలు ఉన్నారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని ఉద్యమిస్తున్నాం.

భారతదేశంలో ప్రజలు మొదటి నుంచీ విద్యా వంతులు. మేము కాస్త వెనుకబడి ఉన్నాం. ఇతర పరిస్థితులన్నీ ఒకేలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో రైతు, కార్మిక ఉద్యమాలు గత కొన్నేళ్లుగా పెరిగాయి. కార్మిక పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉపాధి కోసం విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇండియా ప్రజాస్వామ్య దేశం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సిఎఎను ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ప్రజలను విడగొట్టే ఇలాంటి చర్యలు సరికావు.

Related posts