telugu navyamedia
news telugu cinema news

ప్రియతమా…

priyatama poetry corner

నీ పలుకులన్నీ నా జ్ఞాపకాలు గా……
భద్ర పరచాను హృదయం లో …..
నీ చిరునవ్వులన్నీ నా హారం లో ముత్యాలు గా…
అలంకరించుకున్నాను హృదయం పై…..
నీ స్వరం లో సంగీత స్వరాలు వినగానే…..
ఈ పాదం నిలువక నర్తించును రా…..
నీ ధ్యానం లో నా వేలి కొసలు …..
వీణా నాదాన్నే వినిపించును లే ……
నీ పరవశంలో కోయిల రాగాలే ……
వినిపించును లే శ్రావ్యంగా …….
నీ ఎదలో నేనే ఉంటే,నా జడ లోని……
మల్లెల సువాసనలు నిను…….
రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి రా !
నీ రాక చూడగానే ఈ పెదాల పై…….
చిరునవ్వు మెరుపు మెరియును రా!
చిరు చిరు జల్లుల వాన లో నీ తలపులతో…..
తడిసిన  మనసుకు ……..
వెచ్చని వలపులు ఇవ్వగా రా రా !

-జె.పద్మావతి
ఆదోని.

Related posts

ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందిస్తాం: రాహుల్

vimala p

తెరాస అధికారంలోకి రావాలి … లగడపాటి పద్మ…

vimala p

శ్రీ లక్ష్మి పిక్చ‌ర్స్ ద్వారా  ఫిబ్ర‌వరి 22న ” క్రేజీ కేజీ ఫీలింగ్” గ్రాండ్ గా విడుద‌ల‌

ashok