telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా నాగ్

nagarjuna

కింగ్ నాగార్జున ప్రస్తుతం సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌డానికి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌రుడ‌వేగ చిత్రంలో రాజ‌శేఖ‌ర్‌తో యాక్ష‌న్ పార్ట్‌ను ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించి తీరు న‌చ్చ‌డంతో నాగార్జున ఈ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు రా డిపార్ట్‌మెంట్‌లో ఏజెంట్‌లా ప‌ని చేసి రిటైర్డ్ అయిన మిల‌ట‌రీ ఆఫీస‌ర్ త‌ర్వాత చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా మారి ఏమేం చేశాడ‌నేది క‌థాంశమ‌ట‌.

Related posts