telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రారంభ‌మైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌..

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయం‍త్రం 5 గం. వరకు ఓటింగ్‌ జరగనుంది.

గ్రీన్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎంపీలు, పింక్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు.

సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశముంటుంది.

ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

Related posts