telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ లో కాగ్ ద్వారా ఆడిట్ .. పాలకమండలి కీలక నిర్ణయం!

tirumala guest house

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆడిట్‌పై పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆడిట్‌పై విమర్శల నేపథ్యంలో టీటీడీ ఆడిట్‌ను ఇకపై నుంచి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ( కాగ్ ) ద్వారా చేయాలని ఏపీ సర్కార్ కు పాలకమండలి సిఫార్సు చేసింది.

2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించారు. దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి కోరింది.2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

టీటీడీ తాజా నిర్ణయంపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం వెల్లడి చేసినందుకు ఏపీ సీఎం జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Related posts