telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరెంటు పోవడానికి వీల్లేదు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

KCR cm telangana

తెలంగాణలో కరెంటు పోవడానికి వీల్లేదని సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కనురెప్ప పాటు కూడా కరెంటు తీసివేయడానికి వీల్లేదంటూ ఆయన అధికారులకు సూచించారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వాటి పనితీరు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందుల బారిన విద్యుత్ సంస్థలు పడొద్దనేదే ప్రభుత్వ విధానమని కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలో గ్రామాలు, పట్టణాల్లో పవర్ వీక్ నిర్వహిస్తామన్నారు. సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని కేసీఆర్ సూచించారు. స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలు ప్రతి నెలా కరెంట్ బిల్ కట్టేలా కఠినమైన విధానం అవలంబిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Related posts