telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అతగాడి నోట్లో .. 526 +32 దంతాలు .. ఇంతపెద్ద నోరో.. !

boy have 558 teeths viral

సాధారణంగా పిల్లల్లో దంతాల సంఖ్య – 20.. పెద్దల్లో అయితే 32 ఉండడం సహజం. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ బాలుడి నోట్లో 526 దంతాలు ఉన్నాయి. ఆశ్చర్యపోకండి.. ఇది నిజం. చెన్నైకి చెందిన ఏడేళ్ల బాలుడు దవడ వాపుతో తీవ్రంగా బాధపడుతున్నాడు. దీంతో ఆ బాలుడిని సవీత డెంటల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేయగా.. దిగువ భాగంలోని కుడి దవడ భాగంలో 200 గ్రాముల బరువున్న ఓ సంచిని గుర్తించారు. ఐదు గంటల పాటు వైద్యులు సర్జరీ చేసి ఆ సంచిని తొలగించారు.

ఆ సంచిలో మొత్తం 526 దంతాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వీటిలో కొన్ని పొడవుగా, పొట్టిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడికి మూడేళ్ల వయసులోనే కుడి దవడ వాపు వచ్చేదని అతడి తల్లిదండ్రులు తెలిపారు. సాధారణంగానే వాపు వస్తుందనుకున్నారు తల్లిదండ్రులు. ఇటీవలి కాలంలో దవడ వాపు మరింత ఎక్కువ అవడంతో.. వైద్యులను సంప్రదించారు. దీంతో ఆ బాలుడి నోట్లో 526 దంతాలు ఉన్నట్లు బయటపడింది. ఈ దంతాలు పోను అందరిలాగే ఆ అబ్బాయికి కూడా 32 దంతాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts