telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించనున్న జగన్!

machilipatnam as ntr district by jagan

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి చిత్ర పరిశ్రమతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి చేరుకొని విజయ నిర్మల భౌతికకాయానికి నివాళులు ఆర్పిస్తారు.

గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి చేరుకొని విజయ నిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. భార్య మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను కేసీఆర్‌ కేసీఆర్ ఓదార్చారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

Related posts