telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చంద్రయాన్-2 బాహుబలి” గురించి ప్రభాస్ ఏమన్నాడంటే…?

Prabhas

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన “బాహుబ‌లి” చిత్రం భారీ విజ‌యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంత‌ర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ఈ సినిమా పేరుని ఇస్రో శాస్త్ర్ర‌వేత్త‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన చంద్ర‌యాన్-2ని విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ పెట్టిన జీఎస్ఎల్‌వీ మార్క్-3 ఎం 1 వాహ‌కానికి పెట్టారు. ఈ ప్ర‌యోగ్రాన్ని సోమ‌వారం ఇస్రో శాస్త్ర‌వేత్తలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. బాహుబలి చిత్ర యూనిట్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఇస్రో శాస్త్రవేత్తలకు థాంక్స్ చెబుతూ, చంద్రయాన్ 2 వాహకానికి తమ సినిమా పేరు పెట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు. అనంత‌రం చంద్ర‌యాన్ 2పై బాహుబ‌లి ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. “హ‌లో డార్లింగ్స్‌, చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం విజ‌య‌వంతంగా కావడం ప‌ట్ల యావ‌త్ భారతీయులు గ‌ర్వ‌ప‌డుతున్నారు. చంద్ర‌యాన్2ను క్ష‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన వాహ‌కానికి బాహుబ‌లి అనే పేరు పెట్టడం గౌర‌వంగా భావిస్తున్నాను. 300 వంద‌ల ట‌న్నుల బ‌రువైన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించ‌డం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది” అన్నారు.

Related posts