telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ముంబై : .. కాంగ్రెస్ పార్టీకి .. రాజీనామా చేసిన నటి ఊర్మిళ …

actress urmila from congress in mumbai

గత ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్మిలా మందోత్కర్‌ పార్టీని వీడారు. నేడు పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాల వలనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆ లేఖలో తెలిపారు. ముంబై శాఖలోని కొంత మంది నేతలు పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముందుకు రావట్లేదని అన్నారు. ఈ అంతర్గత రాజకీయాల్లో తనను పావుగా వాడుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తాను సిద్ధంగా లేనని… అన్నారు.

నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్మిళ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ముంబయి నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బిజెపి అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Related posts