యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో పుల్ బిజీ బిజీగా ఉన్నాడు..ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ . ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. మరో స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ ‘ఆదిపురుష్ ఒకటి. నేడు శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ రోజు శివ రాత్రి సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది 2023 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పలు టెక్నికల్ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటి కృతిసనన్ సీత పాత్రలో నటించారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా, బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్దత్త నగే హనుమంతుడిగా కనువిందు చేయనున్నారు.
#Adipurush
Worldwide Theatrical Release in 3D on 12th Jan 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 #ShivChanana #TSeries pic.twitter.com/ozGRZPRiQR— Om Raut (@omraut) March 1, 2022