telugu navyamedia
telugu cinema news trending

ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే

Pooja-Hegde

పూజా హెగ్డే “ముకుంద”, “ఒక లైలా కోసం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ అందుకుంది. పూజా హెగ్డే ఇటీవల “మ‌హ‌ర్షి” చిత్రంతో అభిమానుల‌ని అల‌రించ‌గా, ఆమె తాజా సినిమా “గద్దలకొండ గణేష్” చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా “అల‌.. వైకుంఠ‌పుర‌ములో”, “హౌజ్‌ఫుల్-4”, ప్ర‌భాస్‌ రాధాకృష్ణ చిత్రాల‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు సమాచారం. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌ త‌న నాలుగో చిత్రాన్ని చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే బాలీవుడ్‌ లో పూజా హెగ్డేకు తొలి సినిమాలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో నటించే అవకాశం వచ్చింది. ‘మొహంజదారో’ వంటి భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో పూజను బాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాపైనే దృష్టి పెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సరసన నటిస్తున్న ‘హౌస్‌ఫుల్‌-4’ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా బాలీవుడ్‌లో తన కెరీర్ గురించి పూజ మాట్లాడింది. “మొహంజదారో విఫలమవడం వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయా?` అని అందరూ అడుగుతుంటారు. ఆ సినిమా చేసినందుకు నాకేం బాధ లేదు. ఆ సినిమా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. హృతిక్ వంటి స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినందుకు ఎప్పటికీ గర్వపడతాను. అయితే సినిమా ఫలితం అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు” అని పూజ చెప్పింది.

Related posts

అంపైర్ పై .. ఇంగ్లాండ్ ఆగ్రహం..

vimala p

“ఎంత మంచివాడవురా” టీజర్

vimala p

“చంద్రయాన్-2 బాహుబలి” గురించి ప్రభాస్ ఏమన్నాడంటే…?

vimala p