telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు : పోలీస్ కమిషనర్

cp sajjanar on disa accused encounter

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా మోలార్ దేవ్ పల్లి లో పల్లె చెరువు కట్ట తెగకుండా ఆయా శాఖల అధికారులతో చర్చించాము అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. మేము ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాము. అలాగే చెరువు కట్ట తెగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని తెలిపారు. ఈ వర్షాల తర్వాత మేము మైలార్ దేవుపల్లి అలీ నగర్ పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించము అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు పల్లె చెరువు లో మూడు రంధ్రాలను మూసి వేశాము అని చెప్పిన ఆయన పల్లె చెరువు కట్టపై గండి పడ్డ అతిపెద్ద రంధ్రాన్ని మూసి వేసే పనిలో ఇరిగేషన్ జిహెచ్ఎంసి రెవెన్యూ అధికారులు నిమగ్నమై ఉన్నారు అని తెలిపారు. అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పిన కమిషనర్ 24 గంటలు అన్ని బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి అని తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితులను రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ జిహెచ్ఎంసి ఇతర సిబ్బందితో కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నం అని తెలిపారు.

Related posts