telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టుకు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామ‌కం..

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. 

చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సతీష్ చంద్రశర్మను బదిలీ చేసిన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్స్ జారీ చేసింది.

తాజాగా చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.  జస్టిస్ భుయాన్ 2011 అక్టోబర్ 17న ఉజ్జల్ గౌహతి హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20వ తేదీన నిర్దారించబడ్డారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. 

తర్వాత ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. 2019 అక్టోబర్ 3వ తేదీన బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ముంబైలో రెండేళ్లపాటు పనిచేసిన తర్వాత.. ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.

కాగా..జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ కావడంతో… రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 11కు చేరుతుంది.

Related posts