telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది: మోదీ

pm modi fire pulvama terror attacks

అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతామని ప్రధాని మోదీ అన్నారు. అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ మాట్లాడుతూ..దాడికి పాల్పడివారిన వదిలేది లేదని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులు పెద్ద సాహసమే చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశమే కాకుండా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిచాయి.

ఉగ్రాదాడి నేపథ్యంలో మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మానవతావాదులంతా కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తీవ్రవాదులతో పోరాటంలో ఒక్కటై సాగాలన్నారు. పుల్వామా దాడి తర్వాత మనసంతా దుఃఖంతో నిండిపోయిందన్నారు. సైనికుల ధైర్య సాహసాలపై నమ్మకం ఉందని, భారత్‌లో అస్థిరత్వం సృష్టించే ప్రయత్నాలు సాగవన్నారు. ఇలాంటి హేయమైన చర్యలతో వెనకడుగు వేసే దేశం మనది కాదని పేర్కొన్నారు.

Related posts