telugu navyamedia
telugu cinema news trending

“ఆర్‌డీఎక్స్ లవ్” ట్రైలర్ : ఆడ‌పిల్ల వేటాడాల‌నుకుంటే మ‌గ సింహం కూడా కుక్క‌పిల్లే…!

RDX-Love

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ ప్ర‌స్తుతం “ఆర్‌డీఎక్స్ లవ్” అనే చిత్రం చేస్తుంది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇటీవలే చిత్ర ఫ‌స్ట్‌లుక్ వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ వెరైటీ డాన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ డాన్స్ హైలెట్ అని చెబుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, హాట్ రొమాన్స్ యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం సినిమాల్లో పెరుగుతున్న రొమాన్స్ కి టీజ‌ర్ పీక్స్‌గా ఉంద‌ని అనుకున్నారు. ట్రైల‌ర్ ఎలా ఉంటుందోన‌ని భావించారు. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా అస‌లు స్టోరీ ఏంటో చూపించారు. “వేటాడాలనుకున్న మ‌గాడికి ఆడ‌పిల్ల లేడిపిల్ల‌లా క‌న‌పించొచ్చుకానీ ఆడ‌పిల్ల వేటాడాల‌నుకుంటే మ‌గ సింహం కూడా కుక్క‌పిల్ల‌లా క‌న‌ప‌డుతుంది” అని పాయ‌ల్ చెప్పే ప‌వ‌ర్‌ఫుట్ డైలాగ్ ఆమె క్యారెక్ట‌ర్‌లోని డెప్త్‌ను తెలియ‌జేస్తుంది. ఈమె పాత్ర పేరు అలివేలు అని అర్థ‌మ‌వుతుంది. “క్యారెక్ట‌ర్ ఉన్న ఆడదాని మాటే అగ్రిమెంట్‌రా” అని ఆదిత్య మీన‌న్ చెప్పే డైలాగ్ త‌న‌లోని విల‌నిజాన్ని ఎలివేట్ చేస్తుంది. “అమ్మాయిల‌తో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్ర‌తిమాలండి, క‌రిగిపోతారు. అబ‌ద్దం చెప్పి బాధ పెట్ట‌కండి, క‌రిగించేస్తారు” అని పాయ‌ల్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts

పిక్ లీక్… ఆర్మీ ఆఫీసర్ గా మహేష్

vimala p

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. సిరీస్ ను కైవసం చేసుకున్న .. కోహ్లీ సేన..

vimala p

వేసవి సెలవులలో .. తరగతులు, అందుకే శ్రావణి హత్య.. : పోలీసులు

vimala p