telugu navyamedia
సినిమా వార్తలు

బంగార్రాజు మూవీ ఐట‌మ్‌ సాంగ్‌

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది క్యాప్షన్‌. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా రూపొందుతుంది. నాగార్జున స‌ర‌స‌న సీనియర్‌ నటి రమ్యకృష్ణ, చైత‌న్య స‌ర‌స‌న కృతిశెట్టిలు నటిస్తున్నారు.

Faria Abdullah shares screen with Nagarjuna, Naga Chaitanya

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన విడుద‌లైన‌ ఫస్ట్‌లుక్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.  నాగ చైతన్య, నాగార్జునలకు సంబంధించిన ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ  స్పెష‌ల్‌ సాంగ్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్.

 

ఈ స్పెషల్‌ సాంగ్‌లో జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా నాగచైత్యన, నాగార్జునతో కలిసి స్టెప్‌లు వేసింది.
జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ అలాగే చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts