telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ దివాళా తీసిందని .. ఒప్పేసుకున్న ప్రధాని ఇమ్రాన్..

shied pak pm imran khan

ప్రస్తుతం పాక్ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రమే అన్న ప్రచారం కొన్నాళ్లుగా సాగుతుంది..కనీసం మంత్రులు విదేశాల టూర్‌ వెళ్లేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వానికి సంబంధించిన ఖరీదైన కార్లను అమ్మేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. బర్లను, గాడిదలను కూడా అమ్మేశారు. ఇంతటి దుర్లభ స్థితిలో ఉన్న పాక్… తన ఖజానా ఖాళీ కాకుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా ప్రధాని ఇమ్రాన్ విదేశాలకు వెళ్లాలన్నా.. ఒకటికి వంద సార్లు ఆలోచించి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్‌ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందట. సదస్సు దేశ ప్రయోజనాలకు అయితేనే వెళ్లేందుకు సుముఖత చూపుతున్నారట. దీంతో అతని స్నేహితులు డబ్బులు సహాయం చేయడంతోనే.. దావోస్ సదస్సుకు హాజరుకాగలిగాడట. ఇమ్రాన్ దావోస్‌ సదస్సు వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులను పాక్ ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఇమ్రాన్ ఇద్దరు స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్‌, ఇమ్రాన్‌ చౌదరి ఆ ఖర్చులు భరించారట. సదస్సులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని.. పాక్‌కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది.

Related posts