telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వచ్చేనెలలో.. మన్మధుడు 2.. !!

next month manmadhudu 2 movie will launch

అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలలో చెప్పుకోదగ్గ వాటిలో మన్మధుడు ఒకటి. అది అన్నిరకాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. దీనితో సిరీస్ లు తీయడం అలవాటు చేసుకున్న టాలీవుడ్ ఈ చిత్రానికి కూడా అనుబంధం చేసేందుకు సిద్ధం అయ్యింది.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా లాంచింగ్ కి వచ్చేనెల 12వ తేదీన ముహూర్తం కుదిరినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగుతుంది. అందువలన 2 నెలలపాటు అక్కడ షూటింగును ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాకి, త్వరలోనే కథానాయికను ఫిక్స్ చేయనున్నారు.

Related posts