telugu navyamedia
సినిమా వార్తలు

బాల‌య్య కే అది సాధ్యం..ఆయ‌న డిక్షన్​ అలాంటిది..

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ‘అఖండస సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ విచ్చేసారు. అంతేకాకుండా నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ వేడుక‌కు మెగా ఫ్యామిలీ హీరో బ‌న్నీ చీఫ్ గెస్ట్‌గా రావ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. ఈ వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఈ వేడుక‌లో అల్లు అర్జున్ వ్యాఖ్యలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి..‘నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలనీ అన్నారు. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్న ఆయన నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదనీ ఈ నాటి ఈ బంధం ఏనాటిదో అని చెప్పుకొచ్చారు.మా తాత గారు నేరుగా ఎన్టీఆర్ వంటింటికి వెళ్లేవారన్న ఆయన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగామని అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందనీ అన్నారు. బాలయ్య నాకు తండ్రిలాంటి వారన్న బన్నీ బోయపాటి గారి సినిమా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందనీ అన్నారు.

“బాలకృష్ణ ఈ లెవల్​లో ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి. సినిమాపై ఆయనకు ఉన్న ఆసక్తి, డిక్షన్​. ఆయనలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు. సీనియర్​ ఎన్టీఆర్​ తర్వాత ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారని అన్నారు. కల్మషం లేని వ్యక్తి. ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ అదే. అందుకే ఆయనకు ఇంత పెద్ద ఫ్యాన్ ​ఫాలోయింగ్​ ఉంది.​

‘అఖండ’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమకు వెలుగునివ్వాలని ఆశిస్తున్నా. బోయపాటి శ్రీను గారంటే చాలా ఇష్టం. ‘భద్ర’ సినిమా నేను చేయాల్సింది. కానీ ఆర్య ఉండటం వల్ల అది కుదరలేదు. బోయపాటి కెరీర్​ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇష్టపడే వ్యక్తుల్లో ఆయనొకరు.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ట్రైలర్​ చూస్తుంటే అర్థమైపోయింది.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని. ప్రగ్యా జైస్వాల్​కు ఈ సినిమా కెరీర్​లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రీకాంత్​ నాకు అన్నయ్యలాంటివారు. ఇక నుంచి మీరు కొత్త శ్రీకాంత్​ను చూస్తారు. అసలు తమన్ మామూలు ఫాంలో లేడు.. ముట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది అని బన్నీ చెప్పుకొచ్చారు.

 

చిన్న సినిమాల మీద చాలా మందికి సింపతి ఉంటుంది. వారికి ఓటీటీలున్నాయి. కానీ పెద్ద సినిమాలకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదనీ ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా సినిమా గెలవాలని అంటున్నారు. కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.

తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాను ప్రేమించినంతగా.. ప్రపంచంలో ఏ ప్రేక్షకులు కూడా ఏ సినిమాను తెలుగు వారిలాగా ప్రేమించలేరని , తగ్గేదేలే అని తన నయా మేనరిజాన్ని ప్రజంట్ చేశారు. బాల‌య్య అభిమానులు కోసం జై బాలయ్య ‘ అంటూ స్పీచ్ ముగించారు

Related posts