telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

160 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్

30

స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందుతున్న చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. దర్శకుడు మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలోని ‘నీలి నీలి ఆకాశం’ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు ‘నీలి నీలి ఆకాశం సాంగ్’ 160 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంటే ఏకంగా ఆ పాటను 16 కోట్ల మంది చూశారన్నమాట. అసలు మూవీ విడుదల కాకుండా ఓ డెబ్యూ హీరో సినిమా పాటకు ఆ స్థాయిలో వ్యూస్ రావడం రికార్డు అని చెప్పుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటను స్వరపరిచారు. స్టార్ సింగర్ సిధ్ శ్రీరామ్ అద్బుతంగా పాడారు. ఈ చిత్రాన్ని మార్చి నెలలోనే ఉగాది కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Related posts