ఇళయరాజా సంగీతం అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొన్నాళ్లుగా కొని సినిమాల్లో తన పాటలను వాడుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇళయరాజా. తాజాగా మరోసారి తన పాటల వాడకం గురించి స్పందించారు. “`సినిమాల్లో నా పాటలను రీమిక్స్‌లుగా వాడుకుంటున్న సంగీత దర్శకులకు తమదైన సొంత ట్యాలెంట్ లేదనే చెప్పాలి. వారిలో విషయం ఉంటే మరొకరి పాటల కోసం వెతకరు. ఇంకొందరు రూపకర్తలు సినిమా ఫలానా కాలంలో జరుగుతోంది అని చెప్పేందుకు నా పాటలను వాడుతున్నారు. ఇటీవల విడుదలైన “96” చిత్రంలో నేను కంపోజ్ చేసిన చాలా పాటలను వాడారు. అది చాలా తప్పు. ప్రతిభ ఉన్న సంగీత దర్శకులెవరూ పాత పాటలను వాడుకోవాలని చూడరు. ప్రేక్షకులకు కొత్త పాటలను పరిచయం చేయాలని చూస్తారు” అంటూ ఇళయరాజా విమర్శించారు. గతంలో పాటల కార్యక్రమంలో తన పాటలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు తన స్నేహితుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యానికి ఇళయరాజా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.
previous post