telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదర్శకుడు నన్ను మోసం చేసాడు : రాశి

raasi

సంప్రదాయ పాత్రల్లో తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్‌లలో రాశి ఒకరు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజం’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు రాశి. అయితే ఆ పాత్రకు ప్రశంసలతోపాటు విమర్శలుకూడా వచ్చాయి. అయితే ఈ సినిమా వెనుక ఏం జరిగిందో రాశి తెలిపారు. తనకు ముందు చెప్పిన కథతో కాకుండా ఆ పాత్ర శైలి మార్చేసి.. డైరెక్టర్ మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రీకరణ మొదటి రోజే వెళ్లిపోదామనుకున్నానని.. అయితే అప్పటికే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల ఆ చిత్రంలో నటించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ పాత్రలో నటించినందుకు మంచి మార్కులు వచ్చినా.. అలాంటి పాత్రలో మళ్లీ చేయొద్దని ఆమె అభిమానులు సూచించారని చెప్పారు. అలాగే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నదియా లాంటి పాత్రలను చేయడానికి సిద్ధమని తన మనసులో మాటని చెప్పుకొచ్చారు రాశి.

Related posts