telugu navyamedia
culture Telugu Poetry

నవ రత్నాలు.. టీ కప్ లో తుఫానా?

brathuku chitram poetry corner

1.
ఎండలకు
ఉలిక్కి పడ్డట్టుంది!
దిగి వచ్చింది
కరిగి …మంచు కొండ!!

2.
ఎండలలో
తిరిగి వచ్చింది ధర!
చేయాల్సిందే ఇహ
తొలకరి స్నానం!!

3.
పదికి పదీ
వచ్చేస్తున్నయ్!
పట్టుమని
పది మాటలే రావు!!

4.
ఆ చుట్టంవస్తున్నాడంటే
ఎంత పండగో!
అందరి నేస్తం
రుతుపవనాలు!!

5

ఆ నలుగురు
రుణం కూడా తీర్చాలి!
మరో జన్మనివ్వు
దేవుడా!!

6.
ఆటల కాలిపై
రెండే కాట్లు!
కార్పోరేట్ విద్య
విషపు పాము పనే ఇది!

7.
టీ కప్ లో
తుఫానా?
ప్రపంచ యుధ్ధాలే జరగట్లా
రిమోట్ ల కోసం!

8.
వెంట నడవడమే రెండూ!
కానీ ఏదో తేడా?
కొన్ని గొర్రెలూ…
కొన్ని చీమలూ…

9.
ఇల్లాలే గదా
అనుకున్న!
తరువాత తెలిసింది
ఇంటికి ఆనవాలని!!

🙏 సైదులు ఆరేపల్లి🙏

Related posts

రాయిగా మారాను.. దొషులపై జాలి లేదు: నిర్భయ తల్లి

vimala p

రైళ్లలో తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య

vimala p

రాశిఫలాలు : … ప్రయాణాలతో లాభాలు.. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు..

vimala p