telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళకు భయంకర అనుభవం… 6 రోజులు నరకం

Women

బెల్జీయంకు చెందిన ఓ మహిళకు జరిగిన కారు ప్రమాదం ఏకంగా ఆరు రోజులు నరకం చూపించింది. కొరిన్ బాస్టిడ్ (45) అనే మహిళ… జూలై 24న కొరిన్ ప్రయాణిస్తున్న కారు లీజ్ అనే ప్రాంతం వద్ద ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కొండపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొరిన్ స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన ఆమెకు తన మొబైల్ ఫోన్ మోగుతున్న శబ్ధం వినిపించింది. కాని గాయాల కారణంగా కింద నుంచి లేవలేకపోయిందామె. ఆ రోజు మొత్తం ఆమెను సంప్రదించడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రయత్నించారు. కాని కొరిన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయింది. దాంతో తరువాతి రోజు మొబైల్ బ్యాటరీ డేడ్ కావడంతో ఫోన్ స్వీచాఫ్ అయిపోయింది. రెండు రోజుల తర్వాత మెల్లగా పైకి లేచిన ఆమె ఆ వర్షపు నీటిని తన వద్ద ఉన్న చూయింగం బాటిల్‌లో పట్టుకుని గొంతు తడుపుకుంది. మూడు రోజుల పాటు ఆ భయంకరమైన అడవిలోనే గడిపిన కొరిన్… ఎలాగోలా నెమ్మదిగా నడుచుకుంటూ రెండు రోజుల తర్వాత రోడ్డు దగ్గరికి వచ్చింది. కానీ గత ఐదు రోజులుగా ఆహారం తినకపోవడంతో నడిచే ఓపిక లేకపోయిందామెకు. దాంతో రోడ్డు సమీపంలోనే కూర్చున్న కొరిని… మనుషుల అలికిడి వినిపిస్తే గట్టిగా అరిచేది. కాని ఆమె అరుపులు ఎవరికీ వినిపించేవి కావు. అలా ఆరు రోజులు గడిచిపోయాయి. చివరకు ఆరో రోజైన సోమవారం నాడు అటువైపు కారులో వచ్చిన ఓ వ్యక్తి కొరిన్ అరుపులు విని దగ్గరికి వెళ్లి చూశాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే తన కారులో ఎక్కించుకొని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం కొరిన్ ఆసుపత్రిలో కోలుకుంటుంది. అసలేం జరిగిందో కొరిన్ చెప్పడంతో ఆసుపత్రిలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆమె కుటుంబ సభ్యులకు కబురు పెట్టారు వైద్యులు.

Related posts