telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇకపై అది అధికారికంగా నీ సమస్య… అల్లుడిపై నాగబాబు షాకింగ్ కామెంట్

Niharika

మెగా వారింట పెళ్లి సందడి స్టార్ట్ అయింది. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధ వేడుకను ఆగస్టు 13 (గురువారం) సాయంత్రం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. నిహారిక నిశ్చితార్థం తరువాత ఆమె తండ్రి మెగా బ్రదర్ నాగబాబు, అన్నయ్య వరుణ్ తేజ్ సామజిక మాధ్యమాల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ”నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా” అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం పలికారు వరుణ్ తేజ్.

ఇక నాగబాబు రియాక్ట్ అవుతూ.. ”చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య” అంటూ అల్లుడిపై తనదైన స్టైల్ కామెంట్ చేశారు నాగబాబు. ప్రస్తుతం నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారికకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వివాహ నిశ్చితార్థ వేడుకకు మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత అందరూ ఈ మెగా వేడుకలో భాగమయ్యారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం గమనార్హం.

Related posts