telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోలతో ప్రేమాయణం… రూమర్లపై హీరోయిన్ రియాక్షన్

Priya-anand

అందాల భామ ప్రియా ఆనంద్ ప్రేమలో పడిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ప్రియా ఆనంద్‌తో దివంగత నటుడు మురళి కుమారుడు, యువనటుడు అధర్వ ప్రేమలో పడ్డారని రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత నటుడు కార్తీక్‌ తనయుడు గౌతమ్‌తో ప్రియా ఆనంద్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ విషయమై ప్రియా ఆనంద్ స్పందించింది. తాను ఎవరితో ప్రేమలో లేనని, గౌతమ్, అధర్వలు తనకు మంచి స్నేహితులని, ముగ్గురూ కలిసి రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చింది ప్రియా. కాగా తెలుగులో లీడర్ చిత్రంతో ప్రియకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత రామరామ కృష్ణకృష్ణ, 180 వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రియ తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక శ్రీదేవీతో కలిసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో ప్రియ మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది.

Related posts