telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోయపాటి శ్రీనివాస్ పై మైత్రి మూవీస్ కేసు ?

Boyapati-Srinu
రామ్ చరణ్ హీరోగా నటించిన “”వినయ విధేయ రామ”” చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ మంది . నిర్మాత దానయ్య మెంటల్గా అప్ సెట్ అయ్యాడు . దర్శకుడు బోయపాటి పేరు చెబితే మండిపడుతున్నాడు . తనని  నిలువునా ముంచేశాడని దానయ్య వాపోతున్నాడు . బయ్యర్లకు సమాధాన చెప్పలేక సతమత మవుతున్నాడు . హీరో రామ్ చరణ్ తన అభిమానులు , ప్రేక్షకులకు ఒక బహిరంగ లేఖ రాసాడు అందులో వారు ఊహించిన విధంగా “వినయ విధేయ రామ” సినిమాను అందించలేకపోయామని ఒప్పుకున్నాడు . 
దీనిని బట్టి సినిమాను బోయపాటి బాగా తియ్యలేకపోయాడని రామ్ చరణ్ ఒప్పుకున్నాడు . ఇదీలావుంటే “వినయ విధేయ రామ” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి బోయపాటిని ఆకాశానికి ఎత్తేశాడు . అతని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు . రామ్ చరణ్ లేఖను చదివిన తరువాత బోయపాటితో చిరంజీవి సినిమా చెయ్యడని అర్ధమైంది . చిరంజీవి ముఖం చాటేసినట్టే . వీటన్నింటికీ మించి బోయపాటికి మరో దెబ్బ బలంగా తగిలింది . అతని సమర్ధతపై నిర్మాతలకు నమ్మకం సడలిపోవడమే  ఈ దెబ్బకు కారణం . 
బోయపాటి బాలకృష్ణతో లెజెండ్ చిత్రం నిర్మించే రోజుల్లో మైత్రి మూవీస్ వారు కోటి యాభై లక్షల రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చారట . 2014లో జరిగిన సంగతి ఇది . బోయపాటి లెజెండ్ టైములో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడు . అందుకే అతని  దర్శకత్వంలో ఓ చిత్రం చేద్దామని మైత్రి మూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని , రవి శంకర్  యలమంచిలి , మోహన్ చెరుకూరి ముగ్గురు బోయపాటిని కల్సి ఈ అడ్వాన్ వుంచమని  అడ్వాన్స్  డబ్బు ఇచ్చారు . 
బాలకృష్ణ తో తీసిన “లెజెండ్” , అల్లు అర్జున్ తో నిర్మించిన “సరైనోడు”చిత్రాలు బాగా ఆడాయి . ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన “జయజానకీ నాయక”, రామ్ చరణ్ తో వచ్చిన “వినయ విధేయ రామ ” రెండు చిత్ర్రాలు ఊహించని పరాజయం పొందాయి . ఈ సినిమాలను కొన్న కొనుగోలుదారులు  అడ్రస్ లేకుండా పోయారు . గత ఆరు సంవత్సరాల నుంచి మైత్రి మూవీస్ వారు బోయపాటిని సినిమా చేసిపెట్టమని అడుగుతూనే వున్నారు . ఎందుకో ఆది కార్య రూపం దాల్చలేదు . 
ఇప్పుడు “వినయ విధేయ రామ ” సినిమాతో వారు బోయపాటితో సినిమా వద్దనుకుని అడ్వాన్ తిరిగి ఇవ్వమని అడిగారు . బోయపాటి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారు నిర్మాతల మండలిని ఆశ్రయించారు . నిర్మాతల మండలి వారు ఈ విషయాన్ని దర్శకుల సంఘం  దృష్టికి తీసుకెళ్లారు . ఇప్పుడీ విషయం పంచాయితీ లో వుంది . 
ఆరు సంవత్సరాల క్రితం తాము ఇచ్చిన కోటి , యాభయ్ లక్షల రూపాయలను వడ్డీతో చెల్లించమై మైత్రి మూవీస్ వారు డిమాండ్ చేస్తున్నారు . 
బోయపాటి తలపట్టుకుని  కూర్చున్నాడు . అసలే దర్శకుడుగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది . సినిమాలు చేస్తాము అని చెప్పిన వారంతా వెనక్కు పోతున్నారు . ఇలాంటి పరిస్థితుల్లో మైత్రి మూవీస్ వత్తిడి పెంచారు . అహంభావం ఎప్పటికైనా అనర్ధానికే నని పాపం బోయపాటి ఇప్పటికైనా తెలుసుకుంటాడా ?

Related posts