telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ లో ప్రదర్శనకు .. ప్రపంచ కప్ ఎంపికకు సంబంధం లేదు .. : చీఫ్ ఎం.ఎస్.కే ప్రసాద్

msk prasad on wrold cup team

చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఐపిఎల్‌లో బాగా రాణించిన వారికి వరల్డ్‌కప్‌ టీమ్‌లో అవకాశం దొరుకుతుందనే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఐపిఎల్‌కు వరల్డ్‌కప్‌ టీమ్‌ ఎంపికకు సంబంధమే లేదని స్పష్టం చేశాడు. ఈ నెల 15న మెగా టోర్నీ కోసం టీమ్‌ను ఎంపిక చేయనున్నారు. ఐపిఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారనే వార్తలకు ఎమ్మెస్కే చెక్‌ పెట్టారు.

ఈ అంశంలో దాదాపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయాన్నే ఎమ్మెస్కే వ్యక్తం చేశాడు. టీమ్‌లో నాలుగో నంబరు బ్యాట్స్‌మెన్‌పై సందిగ్ధత తొలగని కారణంగా ఇంకా టీమ్‌ సభ్యులను ప్రకటించలేదని అన్నారు. ఇప్పటికే తుది జట్టు ఎంపికపై సెలక్టర్లు ఓ అంచనాకు వచ్చేసినట్లు చీఫ్‌ సెలక్టర్‌ వెల్లడించారు.

Related posts