ఈ రోజు తెల్లవారుజామున టాలీవుడ్ లో సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణం సినీ పరిశ్రమని తీవ్రంగా కలచివేసింది. సినీ ప్రముఖులు ఆమె మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. మా అధ్యక్షుడు నరేష్ ఈ రోజు ఇండస్ట్రీ గీతాంజలి గారిలాంటి పెద్ద దిక్కుని కోల్పోయిందని పేర్కొన్నారు. అమ్మ విజయనిర్మలతో ఆవిడకి మంచి అనుబంధం ఉంది. నటిగా ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది భాషలలోనే కాకుండా హిందీలోను నటించారు. నటిగానే కాకుండా వ్యక్తిగతంగానను అందరితో సరదగా ఉండేవారు. ఉన్నట్టుండి ఇలా అందరిని వదిలేసి వెళతారని ఊహించలేదు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆమె అందరికి ఎంతో చేరువగా ఉండేవారు. మంచి చెడులలో భాగం అయ్యేవారు. అంతటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టి పోవడం బాధాకరం. గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను అని నరేష్ తెలిపారు.