telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మురళీమోహన్ రాజకీయ సన్యాసం.. ఇక పోటీలేదట !!

Murali Mohan Comments Filim Industry

నటుడు, లోక్ సభ సభ్యుడు మురళీమోహన్ తన పోటీ పై సంచలన ప్రకటన చేశారు. రాబోవు ఎన్నికలలో తాను పోటీ చేయరాదని ఆయన నిర్ణయించుకున్నారని, ఇదే విషయాన్ని నేడు సీఎం చంద్రబాబును కలిసి ఆయన వివరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మురళీమోహన్ కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యకలాపాలపై మరింత దృష్టిని సారించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు రాజమహేంద్రవరం ఎంపీ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో నిలపాల్సిన అభ్యర్థులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా, దానికి హాజరై, తన మనసులోని అభిప్రాయాన్ని మురళీమోహన్ వెల్లడిస్తారని టీడీపీ వర్గాల సమాచారం.

Related posts