telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

న్యాయ వ్యవస్థలో మంచి పేరు సంపాదించాలి: రవిశంకర్‌ ప్రసాద్‌

Good name in legalMinister Ravii shanker

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హై కోర్ట్ లు న్యాయ వ్యవస్థలో మంచి పేరు సంపాదించాలని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల హైకోర్టులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తుల సంఖ్య పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన తెలిపారు. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ ప్రశ్నకు బదులిచ్చారు.

ఉమ్మడి హైకోర్టును విభజించినందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండగా తెలంగాణ హైకోర్టుకు కేవలం 24 న్యాయమూర్తుల పోస్టులే కేటాయించారని చెప్పారు. దీని వల్ల పెండింగ్‌ కేసులను పరిష్కరించడం సాధ్యం కాదని వివరించారు. జడ్జిల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక యంత్రాంగం ఉంటుందని మంత్రిరవి శంకర్‌ పేర్కొన్నారు.

Related posts