telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని, సుధీర్ బాబు “వి”కి సీక్వెల్ కూడా…!?

v

నాని 25వ చిత్రం ‘వి’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే సుధీర్ బాబు ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తారు. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్స్‌. ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ.. క‌రోనా ప్ర‌భావంతో సినిమా ఏప్రిల్‌కు వాయిదా ప‌డింది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌ను సీక్వెల్ ఉంటుంద‌నే అర్థం వ‌చ్చేలా డిజైన్ చేశార‌ట‌. అయితే ఈ సీక్వెల్ రావాలంటే ఈ ఏడాది కుద‌ర‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే నాని వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి ‘వి’ సీక్వెల్ వ‌చ్చే ఏడాదిలోనే తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.

Related posts