telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్రమాలు వెలికితీస్తుంటే బాబు వెన్నులో వణుకు: మంత్రి కన్నబాబు

minister kannababu

అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని ఏపీ మంత్రి మంత్రి కన్నబాబు అన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. బినామీలకు చెందిన ఆస్తులను కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి బాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని కన్నబాబు మండిపడ్డారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని చెప్పారు.

Related posts