telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చిల్లర పార్టీలు మాత్రమే చంద్రబాబుకు మద్దతు: సి.రామచంద్రయ్య

రాష్ట్రంలోని కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే చంద్రబాబుకు మద్దతిస్తున్నాయని వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేయాలనుకుంటున్న కార్యక్రమాలను జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తిన వేసుకుంటున్నారని తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక నేరస్తుడు కాదని అన్నారు. ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని… అనేక కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే బాధ కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు.

Related posts