telugu navyamedia
andhra news political

చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు: మంత్రి బొత్స

botsa ycp

చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు తాడేపల్లిలో బొత్స మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్ణయంలో చంద్రబాబులాగా వ్యాపారుల సలహాలు తీసుకోలేదన్నారు. అన్ని కమిటీల నివేదికలను చూసిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం జరిగిందన్నారు.

విశాఖపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత మాటలను పరిశీలిస్తే.. వారు రాజకీయంగా లబ్ధిని చూసుకుని మాట్లాడుతారన్నది స్పష్టమైందని బొత్స వివరించారు. శాసన మండలి రద్దుకు, రాజధానికి సంబంధం లేదంటూ.. కొంచెం ఆలస్యం అవుతుందేమోకాని నిర్ణయం మారదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి: సర్వే 

ashok

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

vimala p

అనారోగ్యంతో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి…

Vasishta Reddy