telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ అభ్యర్థి జయప్రదకు .. భద్రత పెంచిన ప్రభుత్వం .. వై ప్లస్..

jayaprada joined in bjp today

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బీజేపీ నాయకురాలు జయప్రదకు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్‌తో జయప్రద పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆమె భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు శాఖ ఆమె భద్రత కోసం 17 మంది సిబ్బందిని కేటాయించింది. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి వద్ద కాపలాగా ఉంచుతామని, మిగిలిన వారు షిప్టుల వారీగా ఆమెకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తారని ఉత్తరప్రదేశ్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్‌ తెలిపారు.

ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌పై అజంఘడ్‌లో పోటీ పడుతున్న జానపద గాయకుడు దినేష్‌లాల్‌యాదవ్‌కు కూడా పోలీసులు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించారు. రాజకీయ నాయకులు, అధికారులు, ఇతరులకు ఉన్న ముప్పు స్థాయిని బట్టి పోలీసులు ఐదు రకాల భద్రత కల్పిస్తారు. ఎక్స్‌, వై, వై ప్లస్‌, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ ముఖ్యమైనవి. జెడ్‌ ప్లస్‌ అన్నిటి కంటే ఎక్కువ స్థాయి భద్రత.

Related posts