పుల్వామాలో భారత సైనికులపై జరిపిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన మెరుపుదాడి చేసింది. ఈ దాడి నేపథ్యంలో చైనా స్పందించింది. భారత్, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సహకారంతో చేపట్టాలని ఇండియాను చైనా కోరింది.
పుల్వామా ఉగ్ర దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ నిర్వహించిన వైమానిక దాడులపై ఆరా తీస్తున్నామన్నారు. దక్షిణాసియాలో భారత్, పాక్ కీలకమైన దేశాలు అని తెలిపింది. మంచి స్నేహం, సహకారం ఉంటేనే రెండు దేశాలు అభివృద్ధి చెందుతాయని వెల్లడించింది. వాస్తవానికి ఇటీవల యూఎన్‌లో పుల్వామా దాడిని ఖండిస్తూ చేసిన ప్రకటనలో చైనా కూడా సంతకం చేసింది.