telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం… ఇక నుంచి 3 రోజులు వీకాఫ్

Microsoft

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు మూడు రోజుల పాటు వీకాఫ్‌ను ప్రకటించింది. ఈ మేరకు జపాన్‌లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ 2,300 మంది ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణాలేంటంటే.. చాలామంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం తక్కువగా వుందట. ఉద్యోగం అంటూ పనిలోనే మునిగిపోతూ.. కుటుంబ సభ్యులతో కొన్ని గంటలు మాత్రమే గడుపుతున్నారని తెలిసింది. ఈ విధానం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన మైక్రోసాఫ్ట్ మేనేజ్‌మెంట్, వారంలో మూడు రోజులు వీకాఫ్ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. అందులో భాగంగా వర్కింగ్ రిఫార్మ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రారంభించి, తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారం వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీకాఫ్‌లు పెంచితే వర్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా అనుకోకండి… ఎందుకంటే ఇది వరకటి కంటే ఇప్పుడు జపాన్ మైక్రోసాఫ్ట్‌లో వర్క్ ప్రొడక్షన్ 39.9 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే… ఇదివరకు మైక్రోసాఫ్ట్‌లో రోజూ ఏవో ఒక మీటింగ్‌లు, చర్చలు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు టైమ్ లేదన్న ఉద్దేశంతో అలాంటి వాటిని పక్కన పెట్టి పని చేస్తున్నారట. తప్పనిసరైతే వాట్సాప్ వీడియో కాల్ లాంటి వాటిలో వర్చువల్ మీటింగ్స్ పెట్టుకొని టైమ్ సేవ్ చేసుకుంటున్నారు. టీ, కాఫీ అంటూ మాటిమాటికీ బయటకు వెళ్లకుండా బుద్ధిగా పని చేసుకుంటున్నారు. అందువల్ల పని త్వరగా అయిపోవడమే కాదు. కంపెనీ వాడుతున్న ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గుతోందట. ఈ ఆలోచన సక్సెస్ అవ్వడంతో దీన్ని కంటిన్యూ చెయ్యడానికి మైక్రోసాఫ్ట్ ప్లాన్స్ వేస్తోంది. అదే జరిగితే ఎల్లప్పుడూ వారంలో 3 రోజులు వీకాఫ్స్ ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మిగతా కంపెనీలు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి.

Related posts