telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్, సుకుమార్ సినిమా కథ ఇదే…?

Surgical strike mahesh selute poilets

“రంగస్థలం” సినిమా తరువాత మహేష్ బాబు దర్శకత్వం వహించబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహేష్ కోసం సుకుమార్ కథ తయారు చేసుకుంటున్నాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ప్రకటించారు. ఇక సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసి సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. దీంతో మహేష్ ను అంతగా మెప్పించిన సుకుమార్ కథ ఏమై ఉంటుందా అనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా అడవి నేపథ్యంలో కొనసాగనుంది అంటూ తాజాగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు “మహర్షి” సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న “మహర్షి” చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. గతంలో మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో “నేనొక్కడినే” అనే సినిమా తెరకెక్కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి ఈసారైనా వీరి కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.

Related posts