telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాలో రౌడీ హీరోల ఫ్యాన్స్ వార్

ఇద్దరు యువ కథానాయకుల అభిమానులు చేస్తున్న హడావిడిపై విమర్శలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, యువ కథానాయకుడు విశ్వక్ సేన్ మధ్య కొంత కాలంగా కూల్ వార్ నడుస్తోంది. ‘ఫలక్ నామా దాస్’ మూవీ సమయంలో మొదలైన ఈ రచ్చ.. సోషల్ మీడియా వేదికగా ఇంకా కొనసాగుతూనే వస్తోంది. తాజాగా మరోసారి ఈ యంగ్ హీరోల ఫ్యాన్స్ పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ పై రెచ్చిపోయారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకి ఓవర్ నైట్ స్టార్డమ్ దక్కింది. ఆ మూవీలో విజయ్ క్యారెక్టర్‌కి ఉండే యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే యాటిట్యూడ్ రియల్ లైఫ్‌లో కూడా చూపించి.., విజయ్ ‘రౌడీ’ హీరోగా తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. అయితే.., ‘ఫలక్ నామా దాస్’లో కూడా హీరో క్యారక్టర్ ఇదే తరహాలో రస్టిక్‌గా ఉండటం.., విశ్వక్ సేన్.. తెర వెనుక కూడా ఇలానే ప్రవర్తించడంతో.. విశ్వక్ ని ప్రేక్షకులు విజయ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. దీనితో రౌడీ హీరో ఫ్యాన్స్ అప్పట్లో విశ్వక్ సేన్‌ని టార్గెట్ చేశారు. అయితే తాజాగా విశ్వక్ ‘హిట్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీనితో ఇప్పుడు వీరిద్దరిలో తోపు హీరో ఎవరన్న విషయంలో ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇకనైనా రౌడీ హీరోల ఫ్యాన్స్.. ఈ అనవసరపు కామెంట్స్‌కు ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.

Related posts