telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అదే పరిస్థితి మీకు వస్తుంది.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక

chandrababu

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయిన కొత్తలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నా అంటూ తియ్యతియ్యగా పిలిచారని… నాలుగు రోజులు తిరక్కుండానే ఓ క్లర్క్ మాదిరి బదిలీ చేశారంటూ విమర్శించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లకు బదిలీ చేయడానికి ముందే అక్కడ అధికారులను తొలగించారని చెప్పారు.

నంగనాచి మాటలు చెప్పే వారిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. నమ్మి చెప్పిన పని చేసిన వారిని ఇప్పటికే ఒకసారి జైలుపాలు చేశారని… మళ్లీ నమ్మితే, ఇదే పరిస్థితి మళ్లీ తలెత్తుతుందన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పారని, వారి దుర్మార్గాల్లో భాగస్వాములు కావద్దని పోలీసు అధికారులకు విన్నవిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఏదైనా తేడా వస్తే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వచ్చిన పరిస్థితే మీకూ వస్తుందని చెప్పారు. కేసులు పెట్టాలంటూ అధికారులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.

Related posts