telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పర్యావరణ హిత వివాహం.. ఆకులు, పూలతోనే అలంకరణ

marriage stage

ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా కొబ్బరి ఆకులు, మొగలి రేకులతో తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో కూచిబొట్లవారి వివాహ వేడుక ఈ నెల 9న మచిలీపట్నంలో ఘనంగా జరిగింది. పచ్చని పెళ్లి పందిరిలో అరుణ్-లీల నవ వధువరూలను పదికాలాల పాటు పచ్చగా ఉండాలని అతిథులు దీవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా వివాహ వేడుక జరగడం ప్రశంసల వర్షం కురిపించింది.

చెట్ల కొమ్మలు, ఆకులు, పూలతో కల్యాణ వేదికను అందంగా అలంకరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. అల్పాహారం భోజనం, స్నాక్స్ ఆరగించడానికి అరటి ఆకులు, పోకచెక్క బెరడుతో తయారుచేసిన ప్లేట్లను వాడారు. పద్దతి ప్రకారం ప్లాస్టిక్ వస్తువుల జోలికి వెళ్లకుండా పర్యావరణ పరిరక్షణ సారం వెల్లడిస్తూ జరిగిన ఈ పెళ్లి వేడుక పలువుర్ని ఆకట్టుకుంది.

Related posts