telugu navyamedia
telugu cinema news trending

‘జెర్సీ’ చిత్రం నుండి .. లిరికాల్ సాంగ్..

lirical video song from jersi movie

నాని కథానాయకుడిగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ రూపొందుతోంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “అదేంటోగాని ఉన్నపాటుగా .. అమ్మాయి ముక్కుమీద నేరుగా .. తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా .. నాకంటూ ఒక్కరైనా లేరుగా .. నన్నంటుకున్న తారవే నువ్వా .. నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా ..” అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. కృష్ణకాంత్ సాహిత్యం .. అనిరుధ్ ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. కొంతకాలంగా తన సినిమాల ఫలితాలు నిరాశపరుస్తూ ఉండటంతో, నాని ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్ ఊపందుకోవడం కూడా ఈ సినిమా రిజల్ట్ పైనే ఆధారపడి ఉంటుంది.

Related posts

స్టేజ్ పై షర్ట్ విప్పిన హీరో… షాకైన ప్రేక్షకులు

vimala p

ట్రిపుల్ తలాక్ : .. నిన్న బిల్ పాస్ .. అంతలోనే డబ్బులు ఇవ్వలేదని …

vimala p

‘ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి యాదే..’ ‘మహర్షి’ ఫస్ట్‌ సింగిల్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ 

vimala p